తాజా రచన

అపద్దపు మాటలు!

భూమికి చంద్రుడికి మధ్య

రాకాసి గబ్బిలంలా
రెక్కలు చాచిన మేఘం
చీకటి విషాన్ని చిమ్ముతోంది

 
తన గుడ్లనే మింగేసి
ముడుచుకొన్న పాములాగున్న
నది వొడ్డున నీడొకటి ఏడుస్తోంది.
 
గద్దకి బిడ్డని బలిచ్చేసిన
పిట్ట ఏడుపుకి
గొంతు కలుపుతోంది చెట్టు
 
అబ్బా...
ఎంత భయానకం!
అంతా భయంకరం!!
 
ప్రకృతి గురించి వొంకర్లుపోయే వాళ్ళ
మనో దౌర్బల్యాన్ని చూడలేను
వొద్దు....
దయచేసి అపద్ధాలు చెప్పొద్దు
మా కళ్ళు కప్పొద్దు!

*****


COMMENTS   

 
+1#2 అపద్దపు మాటలు! — IVNS 2013-04-13 07:46
స.తె. జీ గారు మళ్ళీ ఒక మంచి కవిత తో వచ్చారు
నిజమే, నిజం అపద్దం ఒకే చోట ఉంటాయి దాగి
వెతికే వారిని బట్టి అవి కనిపిస్తాయి.
Quote
 
 
0#1 అపద్దపు మాటలు! — Saikiran 2013-04-13 06:39
SUPER
Quote

Comments