- Get link
- X
- Other Apps
తాజా రచన
- Get link
- X
- Other Apps
అమ్మను తేలు కుట్టిన ఆరాత్రి నాకింకా గుర్తుంది
పదిగంటలపాటు ఎడతెరిపిలేని వానఅతన్ని బియ్యం బస్తా వెనకాలకు తోలింది
ఆ చీకటి గదిలో కౄరంగా కొండి విదిలించి–విషం వదిలించుకుని
మళ్ళీ వాన నెదుర్కొందుకు వెళ్ళిపోయాడు.
దౌష్ట్యపు విషానికి విరుగుడుగా
వందలమార్లు భగవన్నామం స్మరిస్తూ
రెక్కలపురుగుల గుంపుల్లా
బిలబిల్లాడుతూ వచ్చిన గ్రామస్థులు
కొవ్వొత్తులతో దీపాలతో తేలు నీడల్ను
మట్టిలో వేడెక్కిన గోడలమీద
పదింతలుగా ప్రదర్శిస్తూ
అతని వేటలో
అయినా అతను కనపడలేదు.
తేలు ఏమాత్రం కదిలినా
అమ్మ ఒంట్లో విషమూ కదుల్తుందంటూ
కోడికోడీ కోడికొడీ అంటూ నాలుకలు కదిలిస్తూ
తేలు కదలకుండా ఉండాలంటూ
నీ గతజన్మ పాపాలు ఈ రాత్రికి
కాలి బూడిదవుతాయంటూ
ఈ బాధవల్ల వచ్చే జన్మలో
దురదృష్టం క్షీణించిపోనీమంటూ
ఈ అసత్య ప్రపంచంలోని మంచికి వ్యతిరేకంగా
మిగిలిన చెడంతా ఈ నీ బాధకు కృశించి పోవాలంటూ
నీ మాంసశరీరంలోని కోరికలు
ఆత్మలోని ఆకాంక్షలు
ఈ విషం పరిశుద్ధం చెయ్యాలంటూ
మొహాల మీద కాస్తంత అవగాహనతో
అమ్మను మధ్యలో వుంచి వాళ్ళంతా
చుట్టూరా నేలమీద కూర్చున్నారు.
ఇంకాఇంకా కొవ్వొత్తులు, ఇంకా లాంతర్లు
ఇంకా ఇరుగు పొరుగువాళ్ళు
ఇంకా రెక్కల పురుగులు
ఎడతెగని వాన
చాపమీద మూలుగుతూ
మెలికలు తిరుగుతూ మాఅమ్మ
మానాన్న,
నమ్మకాలను విమర్శించే మానాన్న
శాస్త్రీయవాది
ఏంచెయ్యాలో తోచక
పౌడర్లు, మిక్స్చర్లూ, ఔషధ మొక్కలూ వేర్లూ
శాపాలూ, దీవెనలూ అన్నింటినీ
ప్రయత్నిస్తూ మా నాన్న
చివరకు కాస్త కొవ్వును ఆకరచిన వేలిమీద వేసి
అగ్గిపుల్ల గీసి, వెలిగించి
ఆ జ్వాల అమ్మను తినడం చూస్తూనేవున్నాను.
మంత్రాలు చదువుతూ పూజార్లు
విషాన్ని మచ్చిక చేస్కోవాలని చూడటం చూస్తూనేవున్నాను.
ఇరవైగంటలు గడిచాక
కుట్టిన బాధపోయింది
మా అమ్మ మాత్రం
“దేవుడికి కృతజ్ఞతలు
ఆ తేలు నా బిడ్డను వదిలి నన్ను ఎంచుకుంది”
అనువాదం : స్వాతీ శ్రీపాద
Comments
Post a Comment