- Get link
- X
- Other Apps
తాజా రచన
- Get link
- X
- Other Apps
రావణుడు మళ్ళీ మారీచుని దగ్గరికి వెళ్ళి బంగారు లేడిగా పర్ణశాల సమీపాన సంచరించమన్నప్పుడు మారీచుడన్నాడట –
“రాముడు నీవన్నట్టు కఠినుడూ, అకారణంగా
శత్రు సంహారం చేసేవాడు కాదు. రామో
విగ్రహవాన్ ధర్మః ధర్మమే
రాముని రూపంలో అవతరించినదనవచ్చు. ఆ రాముడి శస్త్రాస్త్ర పాండిత్యం నాకెప్పటినుంచో
తెలుసు సుమా! విశ్వామిత్రునితో కలిసి యాగ సంరక్షణకు వచ్చిన ఆ బాల రామునిచేతిలో
చావు తప్పి కన్ను లొట్టపోయి ఇలా తాపస వేషంలో అతని కంట పడకుండా, బతికుంటే
బలుసాకు తినవచ్చునన్న ధోరణిలో జీవితం గడిపాను కొన్ని రోజులు. అంత చిన్న వయసులోనే ఆ
రాముడు నాకు చావంటే ఏమిటో తెలిసేలా చేసినవాడు. మరి ఇప్పుడు, అతని
బల పరాక్రమాలు యే స్థాయిలో ఉంటాయో ఊహించుకుంటేనే వెన్నులోంచీ భయం
పుట్టుకొస్తున్నది.
ఈ అనుభవం చాలక మళ్ళీ మరోసారి మండే నాలుక, తీక్ష్ణమైన
కోరలూ, మాంసాన్ని భక్షించే మృగంగా దండకారణ్యంలో సంచరిస్తూ,
మళ్ళీ మునులను చంపి తింటూ, మరో ఇద్దరు
రాక్షసులతో కలిసి ఆ రామునికి గుణపాఠం చెప్పాలని అతని దగ్గరికి వెళ్ళాను. అతని
తాపసి వేషం చూసి, అతణ్ణి తేలికగా అంచనా వేసుకుని చంపాలనే
ప్రయత్నించాను. కానీ, అతడు వజ్రముతో సమానమైన మూడు బాణములను
నేను, నాతో ఉన్న మరి ఇద్దరు రాక్షసులమీద వేశాడు. దురదృష్టం
వల్ల వాళ్ళిద్దరూ అక్కడికక్కడే మరణించగా, నేను సముద్రపు ఆవలి
ఒడ్డుకు చేరుకుని దాక్కున్నాను. ఇలా – చావు తప్పి కన్ను లొట్టపోయి! రాముని బాణము,
సముద్రపు ఆవలి ఒడ్డుకు వచ్చి నన్ను కానక వెనుకకు మరలి వెళ్ళటం
కళ్ళారా చూసిన నేను గర్వం అణగిపోగా ఇదిగో ఇక్కడ యోగ మార్గాన్ని అవలంబిస్తూ
‘బ్రదుకు జీవుడా’ అని రోజులు వెళ్ళదీస్తున్నాను.
నీకు సరైన గూఢచారులు లేరు. నిజాలను చెప్పి నిన్ను సమాధానపరచే
అమాత్యులు లేరు. నీ శ్రేయోభిలాషిని నేను చెబుతున్నాను విను! సీత పతివ్రతా రత్నం.
ప్రజ్వలించే అగ్ని జ్వాల వంటిది. తొందర పడకు. విభీషణుడు వంటి ధర్మాత్ములైన
మంత్రులతో ఆలోచించి నిర్ణయం తీసుకో నాయనా!”
*****
(ఇంకా ఉంది...)
Comments
Post a Comment