- Get link
- X
- Other Apps
తాజా రచన
- Get link
- X
- Other Apps
మేఘాల రెక్కలతో
వర్ష సీతకోక చిలకలు
భూమి పుష్పం పైన వాలాయి;
వసుధ మహా వృక్షానికి–
పచ్చని పైరుల తేనె పట్లు
ఉదయ కిరణాల జడలకు
నీలాకాశం తయారు చేసి ఇచ్చింది;
మేఘాల జడ కుచ్చులు ;
అందుకే – వాటిని
అందుకున్న ఇన బింబం
సంతోషం మిక్కిలి అయి
మిట్ట మధ్యాహ్నానికి
ఆలాగున సాక్షాత్కారం !
Comments
Post a Comment