- Get link
- X
- Other Apps
తాజా రచన
- Get link
- X
- Other Apps
తియ్ తియ్ తియ్ తలుపులు తియ్ వెయ్ వెయ్ వెయ్ అడుగులు వెయ్
తియ్ తియ్ తియ్ తలుపులు తియ్ చీకటి చెరల బంధన తియ్
వెయ్ వెయ్ అడుగులు వెయ్ వేకువ రేఖల వెంబడి వెయ్
వింటిని వీడిన బాణము నీవై బాణము కందని పరగువు నీవై
ఆకలిగొన్న పులివే నీవై వేటకు అందని జింకవు నీవై
పరుగులు మరవని అశ్వము నీవై అశ్వము బెదిరే వేగము నీవై
కీకారణ్యపు గుహలను వెడలి ఆశల బ్రతుకుకు వంతెన వెయ్
నింగిన మెరిసిన మెరుపువు నీవై నేలను తాకిన చినుకువు నీవై
వరదలు తెచ్చిన ఉప్పెన నీవై ఉధృతి నాపే శక్తివి నీవై
నింగిని అంటే జువ్వవు నీవై జువ్వను అంటిన సెగవూ నీవై
చీకటి దాగిన వెలుగువు నీవై విజయపు దారుల పరుగులు తియ్
Comments
Post a Comment