తాజా రచన

కొత్త పొద్దు

కొత్తగా అనిపించే

కొన్ని పాత సందర్భాల్లో

ఇంద్రధనుసు

కొత్తరంగులు పూసినట్లు

కనిపిస్తుంది

తడారుతున్న ఆకుల మధ్య

ప్రపంచం

పరవశిస్తున్నట్లు వినిపిస్తుంది


సుదూర తీరాల నుంచి

నేలపై వాలిన చినుకులో

పుష్పాన్నై

నిశ్శబ్దంగా రెక్కలు తొడిగిన

పరిమళపు ప్రవాహాన్నై


రెప్పలు మూసుకున్న

ప్రపంచానికి

అసలు రంగులు

అద్దాలని ఉంది

*****

COMMENTS   

 
0#1 కొత్తపొద్దు — పార్థ 2013-04-05 06:53
Good


Comments