- Get link
- X
- Other Apps
తాజా రచన
- Get link
- X
- Other Apps
1
కొన్ని మధుపాత్రల్ని
నేనే పగలగొట్టాను
మరికొన్నేవో
అవే పగిలాయి-
వాటిని ఏరివేయడంలోనే
రాత్రంతా గడిచిపోతుంది-
2
బహుకాలానికి దొరికిన వొర్షించే చీకటి వొటరితనం --
నన్ను నేను తడుముకోవాలి
విటపురంలో
నర్తించి నర్తించీ
నెత్తురొడుస్తున్న పాదాలు..
ఆకస్మికంగా
బహుమానించుకొన్న ముసురు-
నన్ను నేను స్పర్శించుకొని ముద్దాడుకోవాలి-
జలదరిస్తూ
తూలుతున్న
బహిరంతర దేహాత్మలు -
నన్ను నేను విత్తుకొని మొలకెత్తుకొని
భూరోదసులను రంగులించి
అల్లుకొని స్వప్నించుకోవాలి-
3
చీకట్లో
దారిచూపుతున్న మిణుగురులు-
కనుచూపుమేర
నా ఇంటి గడపలో
ఎవరో కాపలా కాస్తో......
Comments
Post a Comment