- Get link
- X
- Other Apps
తాజా రచన
- Get link
- X
- Other Apps
ఆకారంలేని మాటల్లో
సాకారంగా కనబడతాయి
ఊహలు
ఆశలు
భయాలు
బహువిధ బాధాతప్త
విదళిత హృదయాల
నిర్వాణ పర్వాల్లా
మాటలు...మాటలు...మాటలు
కండరాల మధ్య రాపిడే
నిండు జీవితాల్ని శాసిస్తోందని
తెలుసుకున్న నేడు
మాటలకు విలువనివ్వలేక పోతున్నాను !
*****
Comments
Post a Comment